ముగిసిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల
ముగిసిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 05, ( వెలుగు నాడు ప్రతినిధి ) : ఈనెల 1వ తేదీ నుండి ప్రారంభమైన పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయం లోని నిత్య కళ్యాణం మండపం వద్ద వేద పండితులు, పురోహితులు, అర్చకులు ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి,ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్, సభ్యులు తిరుణాల మహోత్సవానికి ముగింపు పలికారుజనవరిలో జరిగిన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు,సహదేవతల రంగుల మహోత్సవం ,అలాగే పెద్ద తిరునాళ్ల మహోత్సవంలో నిర్వహించిన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని గతంలో ఎన్నడూ జరగని రీతిలో అంగరంగ వైభవంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దిగ్విజయంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు చుంచు రమేష్,పాకలపాటి అనసూయ, గుగులోతు రమేష్, జ్యోత్స్న ,ప్రియాంక, గజ్జి పెద్ద ఆంజనేయులు, ఓర్సు సూరమ్మ,కర్నాటి కవిత, తన్నీరు గోపీనాథ్ కల్లూరి శ్రీవాణి, సర్పినేని అప్పారావు,కొల్లిపాక హైమావతి,విజయలక్ష్మి, శనగవరపు వెంకటేశ్వరరావు లకు భక్తులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0