దొంగతనం కేసు ని చెందించిన తిరువూరు పోలీసులు

Jan 18, 2026 - 00:40
 0  9
దొంగతనం కేసు ని చెందించిన తిరువూరు పోలీసులు

దొంగతనం కేసు ని చెందించిన తిరువూరు పోలీసులు

తిరువూరు జనవరి 17 (వెలుగునాడు) ప్రతినిధి : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు
స్థానిక హిమజా కిరాణా షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ ఘటనకు సంబంధించి ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కట్టా రామాంజనేయను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు హిమజా కిరాణా షాపులో చోరీకి పాల్పడి రూ.1 లక్ష నగదును అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల విచారణలో నిందితుడు గతంలో కూడా పలు నేర కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు.నిందితుడి వద్ద నుంచి అపహరించిన రూ.1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.చోరీ కేసును వేగంగా చేధించిన పోలీసుల పనితీరుపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్