పేటలో వార్డుల పునర్విభజన
పేటలో వార్డుల పునర్విభజన
జగ్గయ్యపేట, మే17, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట పట్టణ పరిధిలో వార్డుల పునర్విభజన (వార్డు డీలిమిటేషన్) ప్రక్రియ కొనసాగుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తులసి వెంకట కృష్ణారావు తెలిపారు. జనాభా మార్పులు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డుల సరిహద్దులను పునర్నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు.ఈ డీలిమిటేషన్ ద్వారా ప్రతి వార్డుకు సమాన ప్రజా ప్రాతినిధ్యం కల్పించడం, స్థానిక పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యమని అన్నారు.కొత్తగా రూపొందించిన 36 వార్డు మ్యాపుల వివరాలు ప్రజల పరిశీలన కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డు సచివాలయములలో నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచుతామని, ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు నిర్ణీత గడువు (7 రోజుల) లోగా అధికారులకు లిఖితపూర్వకంగా అందజేయవచ్చని సూచించారు. ప్రజల సహకారంతో పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1