పోలీసు స్టేషన్లో వైసీపీ ఫిర్యాదు

Feb 4, 2026 - 02:25
Feb 4, 2026 - 02:25
 0  27
పోలీసు స్టేషన్లో వైసీపీ ఫిర్యాదు

పోలీసు స్టేషన్లో వైసీపీ ఫిర్యాదు

జగ్గయ్యపేట ఫిబ్రవరి 03 (వెలుగు నాడు ప్రతినిధి ) : రాష్ట్రంలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు అరాచకాలపై తగు చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మంగళవారం ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ నాయకులపై జరుపుతున్న దాడులు,తిరుమల లడ్డుపై అసత్య ప్రచారం మీద స్థానిక వైసీపీ నాయకులతో కలిసి తన్నీరు పట్టణ స్టేషన్ అధికారికి ఫిర్యాదు చేశారు చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మండల అధ్యక్షులు బూడిద నరసింహారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, జిల్లా పంచాయతీ రాజ్ కార్యదర్శి శీలం మంగరావు,నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు ఓర్స్ రాజు, నాయకులు లాహోరీ బద్దు నాయక్, మున్సిపల్ వింగ్ అన్నేపాక మురళి, పట్టణ యువజన విభాగ కార్యదర్శి గొట్టిపాళ్ళ సురేష్, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడి కందుల సత్యనారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, పట్టణ సోషల్ మీడియా సయ్యద్ ఆలీ, పట్టణ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు దారెల్లి మహేష్, మండల స్టూడెంట్ వింగ్ బరిగెల వినోద్, దారెల్లి రాజు, షేక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్